జగనన్న విద్యాదీవెన వాయిదా

ప్రతి ఏటా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో విద్యా దీవెన పథకం కింద నగదు జమ చేస్తుంది ఏపీ ప్రభుత్వం. గతంలో ప్రకటించిన దాని..

Update: 2022-03-08 05:38 GMT

అమరావతి : ఆంధ్రప్రదేశ్ లో విద్యార్థుల ఫీజు రీయంబర్స్ మెంట్ డబ్బుల చెల్లింపుల నిమిత్తం ప్రవేశ పెట్టిన పథకం జగనన్న విద్యా దీవెన. ప్రతి ఏటా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో విద్యా దీవెన పథకం కింద నగదు జమ చేస్తుంది ఏపీ ప్రభుత్వం. గతంలో ప్రకటించిన దాని ప్రకారం ఇవాళ విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఫీజుల డబ్బులు జమ చేయాల్సి ఉంది. కానీ.. ప్రస్తుతం ఈ కార్యక్రమం తాత్కాలికంగా వాయిదా పడింది.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించే ప్రభుత్వ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొనాల్సి ఉంది. అందుకే జగనన్న విద్యా దీవెన పథకం తాత్కాలికంగా వాయిదా పడినట్లు అధికారులు తెలిపారు. విద్యాదీవెన పథకం అమలు చేసే కొత్త తేదీని త్వరలోనే ప్రభుత్వం ప్రకటిస్తుందని పేర్కొన్నారు.


Tags:    

Similar News