బీసీలు మా ప్రాణం.. వారిని వదలబోం

కులాలు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అందించే వ్యవస్థను ఏర్పాటు చేశామని ముఖ్యమంత్రి జగన్ అన్నారు

Update: 2021-11-23 09:03 GMT

కులాలు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అందించే వ్యవస్థను ఏర్పాటు చేశామని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. ఆయన అసెంబ్లీలో బీసీ జనగణన తీర్మానంపై మాట్లాడారు. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబాటుతనం ఎంత ఉందో తెలియాలంటే జనగణన అవసరమని జగన్ అభిప్రాయపడ్డారు. కులాల వారీగా జనగణన ఎప్పుడూ జరగలేదన్నారు. కానీ బీసీలు వెనుకబాటుతనం పోలేదంటున్నారు. రాజ్యాధికారం కొందరికే దక్కుతందని జగన్ చెప్పారు. అందుకే బీసీ జనగణన చేయాలని కోరుతున్నామని చెప్పారు. బీసీ కులాల జనగణన చేయాలన్న తీర్మానాన్ని ఆమోదించాలని జగన్ కోరారు.

అధికారంలోకి వచ్చిన తర్వాత...
తాము అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు అన్ని రకాలుగా న్యాయం చేస్తున్నామని చెప్పారు. నామినేటెడ్ పోస్టులలోనూ, నామినేటడ్ పనుల్లోనూ బీసీలకు అగ్రభాగం ఇస్తున్నామని జగన్ చెప్పారు. ఏ పదవిని భర్తీ చేసినా అందులో బీసీలు తమ హయాంలో ఉంటారని జగన్ అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత శాశ్వత బీసీ కమిషన్ ను ఏర్పాటు చేశామని చెప్పారు. రాజ్యాంగం అమలలోకి వచ్చిన తర్వాత బీసీ జనగణన జరగలేదని, సత్వరం చేపట్టాలని జగన్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.


Tags:    

Similar News