Ys Jagan : జగన్ కు ఇక కష్టకాలమేనా.. ఎప్పుడైనా..ఏదైనా జరిగే ఛాన్స్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై నమోదయిన కేసుల విషయం చివరి దశకు చేరుకున్నట్లే కనిపిస్తుంది

Update: 2025-11-20 09:05 GMT

వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై నమోదయిన కేసుల విషయం చివరి దశకు చేరుకున్నట్లే కనిపిస్తుంది. ఇప్పుడు బీజేపీ కూడా జగన్ కు సాయం చేసే పరిస్థితుల్లో కనిపించడం లేదు. ఆంధ్రప్రదేశ్ లో సొంతంగా అధికారంలో రాకపోయినా దానికి టీడీపీ, జనసేన అండగా ఉంది. అందుకే జగన్ ను నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టే అవకాశాలున్నాయని అనేక మంది సీనియర్ రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. జగన్ వల్ల బీజేపీకి ప్రత్యక్షంగా ప్రయోజనం ఉండదు. అలాగని ఇప్పటి వరకూ నష్టం లేదు. పరోక్షంగా జగన్ తమకు అన్ని రకాలుగా సహకరిస్తున్నాడు. ఆ ఒక్క కారణంతోనే ఇన్నాళ్లు కేసుల విషయంలో చూసీ చూడనట్లు భారతీయ జనతా పార్టీ వ్యవహరించిందంటున్నారు.

ఇప్పటి వరకూ ఆశీస్సులున్నా...
ఇప్పటి వరకూ ప్రధాని నరంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆశీస్సులు జగన్ కు పుష్కలంగా ఉన్నాయి. అందుకే ప్రధాని నరేంద్ర మోదీ ఏపీకి ఇన్ని సార్లు వచ్చినా జగన్ ను ఒక్క మాట కూడా మాట్లాడలేదు. జగన కూడా రాష్ట్రంలో తన ప్రత్యర్థి పార్టీలు బీజేపీతో జత కట్టినా బీజేపీని ఒక్క మాట అనడం లేదు. అలాగే కేంద్ర ప్రభుత్వానికి ఏం అవసరమొచ్చినా కమలం పక్కనే నిలబడుతున్నారు. కాంగ్రెస్ తనకు ప్రధాన శత్రువు కావడంతో బీజేపీకి మద్దతు ఇస్తుండవచ్చు. అందుకే ఏ బిల్లు విషయంలోనైనా,రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లోనైనా జగన్ నేరుగానే మద్దతిచ్చి మోదీ కి ఇష్టమైన వ్యక్తిగా మారాడు. అలాగే బీజేపీ విషయంలో ఒక్క విమర్శ కూడా చేయకుండా జాగ్రత్త పడుతున్నారు.
వైఖరిమార్చుకోవడానికి...
కానీ బీజేపీ తన వైఖరి మార్చుకోవడానికి అనేక కారణాలుంటాయి. బీజేపీకి కూడా దక్షిణాదిన అందులో ఆంధ్రప్రదేశ్ లో తమ బలం పెంచుకోవడం అవసరం. అది జగన్ వల్ల సాధ్యం కాదు. కూటమితో ఉంటే సీట్ల సంఖ్య పెంచుకోవచ్చు. అధికారంలో ఒక రాష్ట్రంలో ఉన్నామన్న సంతృప్తి పొందవచ్చు. కానీ జగన్ వల్ల రాజకీయ ప్రయోజనం కొన్నింటికే పరిమిమై ఉంటుంది. ఈ విషయం గ్రహించిన బీజేపీ తన పంథాను మార్చుకోవచ్చన్న సూచనలు బలంగా అందుతున్నాయి. తమకు జగన్ కంటే రాజకీయ ప్రయోజనాలు ముఖ్యమని భావిస్తే జగన్ కు రానున్న కాలంలో కష్టాలు తప్పవన్న సంకేతాలు ఇప్పటికే వస్తున్నాయి. జగన్ నేడు సీబీఐ కోర్టుకు కొన్నేళ్ల తర్వాత హాజరవ్వడాన్ని కూడా ఈ కోణంలోనే చూడాల్సి ఉంటుంది. అందుకే జగన్ కు రానున్నకాలం కష్టకాలమేనని ఖచ్చితంగా చెప్పొచ్చు.


Tags:    

Similar News