Ys jagan : 21న కోర్టుకు హాజరుకానున్న వైఎస్ జగన్

ఈ నెల 21వ తేదీన వైసీపీ అధినేత జగన్ ఏసీబీ కోర్టులో హాజరు కానున్నారు

Update: 2025-11-12 06:14 GMT

ఈ నెల 21వ తేదీన వైసీపీ అధినేత జగన్ ఏసీబీ కోర్టులో హాజరు కానున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి నవంబర్‌ 21వ తేదీలోపు సీబీఐ కోర్టులో హాజరయ్యే విషయాన్ని మంగళవారం కోర్టుకు తెలిపారు.యూరప్‌ పర్యటన పూర్తయ్యేంత వరకూ వ్యక్తిగత హాజరుకు మినహాయింపు కోరిన జగన్‌ తన వినతిని ఈరోజు విచారణలో ఉపసంహరించుకున్నారు.

నవంబర్‌ 14న హాజరు కాకపోవడంతో...
అక్టోబర్‌లో యూరప్‌ వెళ్లే ముందు విదేశీ పర్యటనకు అనుమతి కోరగా, కోర్టు నవంబర్‌ 14న తిరిగి వచ్చాక స్వయంగా హాజరుకావాలని షరతుపెట్టి ఆమోదించింది.అయితే జగన్‌ ఆ తేదీన హాజరు కాలేదు. నవంబర్‌ 6న వ్యక్తిగత హాజరుకు మినహాయింపు కోరుతూ మెమో దాఖలు చేశారు. ప్రస్తుతం ఆయన నవంబర్‌ 21లోపు కోర్టుకు హాజరవుతానని తెలియజేశారు. దీంతో జగన్ ఈ నెల 21వ తేదీన హాజరవుతారు.


Tags:    

Similar News