Ys Sharmila : ఇదేమి వేట చెల్లీ... ఇంత సాధింపులయితే ఎలా తల్లీ?
వైఎస్ షర్మిలలో ఫ్రస్టేషన్ పీక్స్ కు చేరకున్నట్లు కనిపిస్తుంది. ఏ చిన్న అవకాశాన్ని కూడా షర్మిల వదిలిపెట్టడం లేదు
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల తనకు తాను ఏమనుకుంటుందో తెలియదు. వైఎస్ లెగసీ తనకే ఉందన్న భ్రమలో ఆమె ఉన్నట్లు కనపడుతుంది. అన్నపై పోరాటం చేయవచ్చు. ఇరువురి పార్టీలు వేరు కాబట్టి ఎవరూ వ్యతిరేకించరు. కానీ అదే పనిగా అధికార పార్టీ కంటే ఎక్కువగా సోదరుడిపైనా, ఆ పార్టీ పైన విమర్శలు చేస్తుండటం చూస్తే వైఎస్ షర్మిలలో ఫ్రస్టేషన్ పీక్స్ కు చేరకున్నట్లు కనిపిస్తుంది. ఏ చిన్న అవకాశాన్ని కూడా షర్మిల వదిలిపెట్టడం లేదు. బహుశ అధికార పార్టీ కంటే ఎక్కువగానే విమర్శలు చేస్తుండటం కొంత ఏవగింపుగా మారింది. కేవలం వైసీపీ అభిమానులకు మాత్రమే కాదు. కాంగ్రెస్ పార్టీలోని నేతలు, వైఎస్ తో సంబంధమున్న ముఖ్యమైన సీనియర్ నేతలు సయితం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఆస్తుల వివాదాలే కారణమని...
ప్రజాసమస్యలపై పోరాటం చేసి ప్రజల్లోకి వెళ్లాలి. సోదరుడిని ఓడించాలంటే ఇది మార్గం కాదని వైఎస్ షర్మిలకు సన్నిహితులు, కుటుంబ సభ్యులు ఎవరు చెప్పినా ఆమె ఏకైక లక్ష్యం. జగన్ తిరిగి ముఖ్యమంత్రి కాకూడదనేలా అనిపిస్తుందని వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంలోని కొందరు చేస్తున్న వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆస్తుల వివాదాలే ఈ కక్ష్య లకు కారణం కావచ్చు. ఆస్తి పంచి ఇవ్వకపోవడం జగన్ తప్పు కావచ్చు. అయితే అది కుటుంబ పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టి, సన్నిహితులు, బంధువుల మధ్య రాజీ కుదుర్చుకోవాల్సిన అన్నా చెల్లెళ్లు ఇద్దరూ ఆగర్భ శత్రువులుగా మారారని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
సొంత ప్రయోజనాలకోసమేనంటూ...
ఇక్కడ ఉన్న వీరు కొట్లాడుకుంటూ, వీధి పోరాటాలు చేసుకుంటుంటే కొందరు ఆనందపడవచ్చేమో కానీ పైలోకంలో ఉన్న వైఎస్ ఆత్మ మాత్రం శాంతించిందనే అంటున్నారు. అసలు అధికార పార్టీ తప్పొప్పులను అప్పుడప్పుడు ప్రస్తావిస్తున్నప్పటికీ జగన్ విషయాన్ని పట్టుకుని లాగుతుండటంతో సొంత పార్టీలోనే అసమ్మతి గ్రూపులు బయలుదేరాయి. వైఎఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వచ్చింది సొంత ప్రయోజనాలు కోసమే కాని, పార్టీ బలోపేతం చేయడం కోసం కాదని పార్టీలో ని ముఖ్యనేతలే బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. సుంకర పద్మశ్రీ వంటి వారు అయితే ఏకంగా జిల్లాల్లో షర్మిలకు వ్యతిరేకంగా సభలు పెట్టి కార్యకర్తలను ఏకం చేసే పనిలో ఉన్నారు.
జగన్ పై తీవ్ర విమర్శలు...
ఇప్పుడు వైఎస్ షర్మిల జగన్ పర్యటనలకు అనుమతి ఇవ్వవద్దంటూ ప్రభుత్వాన్ని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. జగన్ ను జైల్లో పెట్టాలని కోరడం కూడా ఆమె కసికి తార్కాణమని చెప్పాలి. వివేకా ను చంపి సునీత మీద నెట్టేసినోళ్ళకు, సింగయ్యను తొక్కి చంపి AI గ్రాఫిక్స్ అనడం ఒక లెక్కనా ? అంటూ వైఎస్ షర్మిల ప్రశ్నించారు. వివేకా హత్య విషయంలో సీబీఐ అన్ని ఆధారాలు చూపుతుంటే సునీత చంపింది అనేటోళ్లకు..టైర్ల కింద తొక్కి గ్రాఫిక్స్ అనక ఏమంటారు ? అని వైఎస్ షర్మిల నిలదీశారు. ఇలా జగన్ వెంటాడమే పనిగా పెట్టుకున్నట్లుందని సాంత పార్టీ నేతలే పార్టీ హైకమాండ్ కు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. హైకమాండ్ కూడా వైఎస్ షర్మిలను పీసీసీ చీఫ్ గా కొనసాగించడంపై పునరాలోచనలో పడినట్లు సీనియర్ కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. షర్మిల కంటే చింతామోహన్, హర్షకుమార్ లాంటి నేతలు ఎక్కువగా అధికార పార్టీ నిర్ణయాలను తప్పుపడుతున్నారన్న కామెంట్స్ వినపడుతున్నాయి.