Big Breaking : టీడీపీలోకి వైసీపీ ఎమ్మెల్యే?
కాకినాడ జిల్లా జగ్గంపేట జ్యోతుల చంటిబాబు టీడీపీలో చేరబోతున్నట్లు సమాచారం
andhra pradesh
కాకినాడ జిల్లా జగ్గంపేట జ్యోతుల చంటిబాబు టీడీపీలో చేరబోతున్నట్లు సమాచారం. ఆయనకు ఈసారి జగ్గంపేట ఎమ్మెల్యే టిక్కెట్ ను జ్యోతుల చంటిబాబుకు ఇచ్చే పరిస్థితి లేదని వైసీపీ అధినేత జగన్ స్పష్టం చేయడంతో ఆయన టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు టీడీపీ నేతలతో జ్యోతుల చంటిబాబు సమావేశమయ్యారు. 2019లో ఆయన వైసీపీ నుంచి జగ్గంపేట ఎమ్మెల్యేగా గెలిచారు.
వచ్చే నెల మొదటి వారంలో....
అయితే టీడీపీలోనూ ఆయనకు జగ్గంపేట టిక్కెట్ ఇచ్చే అవకాశం లేదని టీడీపీ నేతలు తెలిపారు. మరో నియోజకవర్గంలో తనకు పోటీ చేసే అవకాశం కల్పించాలని చంటిబాబు టీడీపీ అధినేతను కోరినట్లు తెలిసింది. దీంతో జ్యోతుల చంటి బాబు వచ్చే నెల 5, 6 తేదీల్లో టీడీపీలో చేరే అవకాశాలున్నాయని పార్టీ నేతలు చెబుతున్నారు.