రెండురోజులు తిరుమలకు వెళ్లకపోవడమే మంచిదట

తిరుమలకు ఈ రెండు రోజుల పాటు వెళ్లకపోతే మంచిది. రద్దీ ఎక్కువగా ఉంది.

Update: 2023-10-01 02:35 GMT

తిరుమలకు ఈ రెండు రోజుల పాటు వెళ్లకపోతే మంచిది. రద్దీ ఎక్కువగా ఉంది. వరుస  సెలవులు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకుంటుండటంతో వసతి గృహాలు దొరకడం కూడా కష్టంగా మారింది. శ్రీవారిని దర్శించుకునేందుకు ఏపీ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తుండటంతో తిరుమల కొండలు కిటకిటలాడిపోతున్నాయి. గోవింద నామస్మరణతో మారు మోగిపోతున్నాయి. నిన్న తిరుమల శ్రీవారిని 87,081 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 41,575 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు

బయట వరకూ...
. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.05 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. ఈ రోజు కూడా తిరుమలలో భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లన్నీ భక్తులు నిండిపోయి అక్టోపస్ బిల్డింగ్ వరకూ క్యూ లైన్ కొనసాగుతుంది. దర్శనానికి ఇరవై నాలుగు గంటల సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు. సర్వదర్శనం కూడా అధికారులు రద్దు చేశారు.


Tags:    

Similar News