ఏ ముఖం పెట్టుకుని మాట్లాడుతున్నావ్.. జగన్ కు నిమ్మల సవాల్

రాయలసీమలో తాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసింది వైఎస్ జగన్ అని నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు

Update: 2026-01-06 08:00 GMT

రాయలసీమలో తాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసింది వైఎస్ జగన్ అని నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. రాయలసీమలో ఉన్న ప్రాజెక్టులకు తట్టెడు మట్టి కూడా ఎత్తిపోయలేదని నిమ్మల రామానాయుడు అన్నారు. ఐదేళ్లలో జగన్ చేయని పనులను చంద్రబాబు ఏడాది కాలంలోనే పూర్తి చేశారని నిమ్మల తెలిపారు. ఈరోజు ఏ ముఖం పెట్టుకుని రాయలసీమ ప్రాజెక్టులపై మాట్లాడతారని అన్నారు.

రాయలసీమలో ప్రతి ప్రాజెక్టు ...
రాయలసీమలో ప్రతి ప్రాజెక్టు తెలుగుదేశం పార్టీ హయాంలోనే వచ్చిందన్నారు. రాజప్రసాదంలో ఐదేళ్ల పాటు మొద్దు నిద్రపోయిన జగన్ కు రాయలసీమ అభివృద్ధి పట్టలేదని నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు. రాయలసీమ నీటి ప్రాజెక్టులపై చర్చించడానికి తాము సిద్ధమని రామానాయుడు తెలిపారు. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నావంటూ జగన్ పై నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు. హంద్రీ నీవా పనులకు కూడా జగన్ ఒక్క రూపాయి కూడా తన ప్రభుత్వ హయాంలో కేటాయించలేదని అన్నారు.


Tags:    

Similar News