ఐపీఎస్ ను రిలీవ్ చేసిన ఏపీ సర్కార్

ఐపీఎస్‌ అధికారిణి గౌతమీశాలి నాలుగేళ్ల డిప్యుటేషన్‌పై కేంద్ర సర్వీసులకు వెళ్లనున్నారు

Update: 2025-03-29 02:51 GMT

ఐపీఎస్‌ అధికారిణి గౌతమీశాలి నాలుగేళ్ల డిప్యుటేషన్‌పై కేంద్ర సర్వీసులకు వెళ్లనున్నారు. ఈ మేరకు ఆమెను రిలీవ్‌ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. డిప్యూటీ కేబినెట్‌ కార్యదర్శి హోదాలో ఆమె కేంద్రంలో విధులు నిర్వహించనున్నారు. ప్రస్తుతం ఆమె విజయవాడ లా అండ్ ఆర్డర్ డీసీపీ గా వ్యవహరిస్తున్నారు.

కేంద్ర సర్వీసుల్లో...
కేంద్ర సర్వీసుల్లో పనిచేయడానికి తనకు అనుమతి ఇవ్వాలంటూ గౌతమిశాలి పెట్టుకున్న దరఖాస్తును ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. వెంటనే ఆమెను రిలీవ్ చేసేందుకు అంగీకరించింది. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో ఐపీఎస్ అధికారి గౌతమి శాలి నాలుగేళ్ల పాటు కేంద్ర సర్వీసులకు డిప్యుటేషన్ పై వెళ్లే అవకాశాన్ని పొందారు.


Tags:    

Similar News