పోలవరం ప్రాజెక్టుకు అంతర్జాతీయ నిపుణుల బృందం

పోలవరం ప్రాజెక్టును అంతర్జాతీయ నిపుణుల బృందం పర్యటిస్తుంది

Update: 2025-08-30 02:30 GMT

పోలవరం ప్రాజెక్టును అంతర్జాతీయ నిపుణుల బృందం పర్యటిస్తుంది. పోలవరం ప్రాజెక్టు ను నిన్నచేరుకున్న అంతర్జాతీయ నిపుణుల బృందం సెప్టెంబర్ ఒకటో తేదీ వరకు వీరు పోలవరం ప్రాజెక్ట్ లోని వివిధ నిర్మాణాలను పరిశీలించనుంది. జలవనరుల శాఖ అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులతో సమీక్షలు నిర్వహించనుందని తెలిపారు.

సలహాలు, సూచనలు...
అంతర్జాతీయ నిపుణుల వెంట కేంద్ర ప్రభుత్వ సంస్థల ప్రతినిధులు కూడా ఉన్నారు. పోలవరం ప్రాజెక్ట్ లో జరుగుతున్న వివిధ నిర్మాణ పనులను పరిశీలించి జలవనరుల శాఖ అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులకు తగు సూచనలు సలహాలు ఈ బృందం ఇవ్వనుంది. అంతర్జాతీయ నిపుణులు రిచర్డ్ డొన్నెల్లి, జియాన్ఫ్రాన్కో డి సికో, డేవిడ్ బి పాల్ ప్రాజెక్ట్ నిర్మాణ పనులను పరిశీలించారు.


Tags:    

Similar News