ఏపీలో సినీ థియేటర్లలో తనిఖీలు

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సినిమా థియేటర్లలో తనిఖీలు చేపట్టారు

Update: 2025-05-28 11:32 GMT

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సినిమా థియేటర్లలో తనిఖీలు చేపట్టారు. రెవెన్యూ, పోలీసు అధికారుల జాయింట్‌ ఆపరేషన్ తో ఈ తనిఖీలు చేశారు. థియేటర్లలో తీసుకున్నరక్షణ సదుపాయాలపై అధికారులు ఆరా తీశారు. విజయవాడతో పాటు తూర్పుగోదావరి జిల్లాలోని కొన్ని థియేటర్లలో ఈ ఉదయం నుంచి సోదాలు కొనసాగుతున్నాయి.

సరైన సదుపాయాలు లేని...
సరైన సదుపాయాలు లేని థియేటర్స్‌ వివరాలు సేకరిస్తున్న అధికారులు నివేదికను రూపొందిస్తున్నారు. ఇటీవల జూన్ 1వ తేదీ నుంచి థియేటర్లు బంద్ చేస్తామని ఎగ్జిబిటర్లు ప్రకటించడంతో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశాలతో సినిమాటోగ్రఫీ మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు ఏపీలోని అన్ని థియేటర్లలో వసతులు, ఆహార పదార్థాల ధరలు, పార్కింగ్ ధరలు వంటి వాటిపై వివరాలు సేకరిస్తున్నారు.


Tags:    

Similar News