నేడు పుట్టపర్తికి భారత రాష్ట్రపతి
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు పుట్టపర్తిని సందర్శించనున్నారు
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు పుట్టపర్తిని సందర్శించనున్నారు. పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి బాబా శత జయంతి వేడుకల్లో రాష్ట్రపతి పాల్గొననున్నారు. శ్రీ సత్యసాయి సమాధిని దర్శించుకోనున్నారు. తర్వాత యూనివర్సిటీలో జరిగే స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొంటారని శ్రీ సత్యసాయి ఆలయ నిర్వాహకులు తెలిపారు.
స్నాతకోత్సవంలో...
ఈరోజు రాష్ట్రపతి పుట్టపర్తి వస్తుండటంతో భారీబందోబస్తు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నుంచి బయలుదేరి రాష్ట్రపతి పుట్టపర్తికి చేరుకోనున్నారు. నిన్న హైదరాబాద్ కు చేరుకున్న రాష్ట్రపతి రాజ్ భవన్ లో బస చేశారు. మరికాసేపట్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బయలుదేరి పుట్టపర్తికి వెళ్లనున్నారు. పుట్టపర్తిలో రాష్ట్రపతి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి.