రేపు మరో అల్పపీడనం... భారీ వర్షాలు
ఈ నెల 25న అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావంతో భారీ వర్షాలు పడతాయని పేర్కొంది.
ఈ నెల 25న అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావంతో భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. బంగాళాఖాతంలో ఈ నెల 25వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. వాయవ్య బంగాళాఖాతంలోని ఒడిశా-ప.బెంగాల్ తీరాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారుతుందని పేర్కొంది.
ఈ నెల 26, 27 తేదీల్లో...
దీని ప్రభావంతో 26, 27 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖఫట్నం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ ప్రభావంతో తెలంగాణలోనూ అక్కడక్కడ తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.