వైసీపీ నేత ఇంట్లో రెండో రోజు ఐటీ సోదాలు
భీమవరంలో రెండో రోజు ఐటీ శాఖ సోదాలు నిర్వహిస్తుంది. మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఇంట్లో సోదాలు జరుపుతున్నారు
IT Raids grandhi srinivas house
పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో రెండో రోజు ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఇంట్లో సోదాలు జరుపుతున్నారు. నిన్నటి నుంచి గ్రంధి శ్రీనివాస్ ఇంట్లోనూ వారి సన్నిహితుల కుటుంబాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహిస్తున్నారు. పన్ను ఎగవేశారన్న ఆరోపణలపై ఈ సోదాలు జరుపుతున్నారు.
పన్ను ఎగవేత ఆరోపణలపై...
2019 ఎన్నికల్లో గ్రంధి శ్రీనివాస్ అప్పటి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఓడించి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన ఇంట్లో ఐటీ దాడులు జరుగుతుండటం రాజకీయంగా కూడా చర్చనీయాంశమైంది. గత రెండు రోజులుగా హైదరాబాద్ నుంచి వచ్చిన ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది.