తిరుపతిలో సాధువులు ఆమరణ దీక్ష

తిరుపతిలో సాధువులు ఆమరణ దీక్షకు దిగారు. టీటీడీ పరిపాలన భవనం ముందు పీఠాధిపతులు, స్వాములు దీక్ష చేపట్టారు

Update: 2025-02-12 06:16 GMT

ys jgans tour in tirumala

తిరుపతిలో సాధువులు ఆమరణ దీక్షకు దిగారు. టీటీడీ పరిపాలన భవనం ముందు పీఠాధిపతులు, స్వాములు దీక్ష చేపట్టారు. అలిపిరి శ్రీవారి పాదాల వద్ద ముంతాజ్ పేరుతో హోటల్ నిర్మాణం జరుగుతుండటాన్ని వారు వ్యతిరేకిస్తున్నారు. హోటల్ నిర్మాణం వెంటనే ఆపాలని శ్రీనివాసానంద స్వామి గత కొంతకాలంగా పోరాటం చేస్తున్నారు.

ముంతాజ్ హోటల్ నిర్మాణాన్ని...
తిరుమల ప్రక్షాళన అన్న చంద్రబాబు, సనాతన ధర్మం అన్న పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలని స్వాములు డిమాండ్ చేస్తున్నారు. తిరుమల శ్రీవారి సన్నిధికి వెళ్లే మార్గంలో ఈ ముంతాజ్ హోటల్ నిర్మాణమేంటని వారు ప్రశ్నిస్తున్నారు. దీనికి ఇచ్చిన అనుమతులను వెంటనే నిలిపేయాలని ఆందోళనకు దిగడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.


Tags:    

Similar News