యాభై లక్షల ఇళ్లను టచ్ చేసిన టీడీపీ నేతలు

సుపరిపాలనలో తొలి అడుగులో రాష్ట్ర వ్యాప్తంగా యాభై లక్షల ఇళ్లకు టీడీపీ నేతలు వెళ్లారు.

Update: 2025-07-20 02:09 GMT

సుపరిపాలనలో తొలి అడుగులో రాష్ట్ర వ్యాప్తంగా యాభై లక్షల ఇళ్లకు టీడీపీ నేతలు వెళ్లారు. కేవలం పద్దెనిమిది రోజుల్లోనే యాభైస లక్షలకు పైగా ఇళ్లను సందర్శించినట్లు టీడీపీ కేంద్ర కార్యాలయం తెలిపింది. టీడీపీ శ్రేణులు ప్రతి ఇంటికి వెళ్లి ఏడాది కాలంలో ప్రభుత్వం చేసిన మంచి పనులు వివరించారని, అందిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించినట్లు తెలిపింది.

పద్దెనిమిది రోజుల్లోనే
మంత్రి లోకేశ్ పర్యవేక్షణలో ప్రతి ఇంటికి వెళ్లేలా సాంకేతికంగా ఈ లెక్కలు తీశారు. టమి ప్రభుత్వ పాలనను వివరిస్తూ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు కూడా పాల్గొన్నారు. ప్రభుత్వ పాలనపై ప్రజల అభిప్రాయాలు, సలహాలు స్వీకరిస్తున్న నేతలు ఆఫీడ్ బ్యాక్ ను రాష్ట్ర పార్టీ కార్యాలయానికి పంపుతున్నారు. సుపరిపాలనలో తొలి అడుగు నిర్వహణపై డ్యాష్ బోర్డు ద్వారా నివేదికలు ఎప్పటికప్పుడు పార్టీ కేంద్ర కార్యలయం తెప్పించుకుంటుంది. పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి మెసేజ్, ఐవీఆర్ఎస్ ద్వారా క్షేత్రస్థాయి నేతలు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు.


Tags:    

Similar News