TDP : ఆ నలుగురిలో ఒక్కరికే టిక్కెట్.. ముగ్గురికి హ్యాండ్ ఇచ్చినట్లేనా?

తెలుగుదేశం పార్టీ తొలి జాబితాలో పార్టీ మారిన నలుగురిలో ఒకరికి మాత్రమే తొలి జాబితాలో చోటు దక్కింది

Update: 2024-02-24 07:41 GMT

తెలుగుదేశం పార్టీ తొలి జాబితాలో పార్టీ మారిన నలుగురిలో ఒకరికి మాత్రమే తొలి జాబితాలో చోటు దక్కింది. వైసీపీ నుంచి టీడీపీలోకి నలుగురు క్రాస్ ఓటింగ్ తో సస్పెన్షన్ కు గురై టీడీపీలో చేరారు. గతంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా క్రాస్ ఓటింగ్ జరిగిందని నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలను వైసీపీ సస్పెండ్ చేసింది. అయితే అందులో తొలి జాబితాలో ఒక్కరికే సీటు దక్కింది. మిగిలిన ముగ్గురి సీట్లు తొలి జాబితాలో చోటు దక్కించుకోకపోవడం చర్చనీయాంశమైంది.

మిగిలిన ముగ్గురిలో...
వైసీపీలో గెలిచి క్రాస్ ఓటింగ్‌కు పాల్పడిన వెంకటగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి టీడీపీలో చేరారు. వీరిలో నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి ఒక్క కోటంరెడ్డి పేరు మాత్రమే తొలి జాబితాలో ఉంది. ఆనం రామనారాయణరెడ్డిని వెంకటగిరి లేదా ఆత్మకూరు నియోజకవర్గం నుంచి పోటీ చేయించే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. ఉండవల్లి శ్రీదేవికి ఎక్కడా చోటు దక్కలేదు. ఉదయగిరి టీడీపీ అభ్యర్థిగా కాకర్ల సురేష్ పేర్లను ప్రకటించారు. దీంతో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి ఇక టిక్కెట్ లేనట్లేనని స్పష్టంగా తెలుస్తుంది.


Tags:    

Similar News