నెల్లూరు జిల్లాలో భూప్రకంపనలు

నెల్లూరు జిల్లాలో భూమి స్వల్పంగా కనిపించింది. ఐదు సెకన్ల పాటు భూమి కంపించిందని స్థానికులు చెబుతున్నారు.

Update: 2022-08-13 13:36 GMT

నెల్లూరు జిల్లాలో భూమి స్వల్పంగా కనిపించింది. జిల్లాలోని మూడు సెకన్లలో ఐదు సెకన్ల పాటు భూమి కంపించిందని స్థానికులు చెబుతున్నారు. వింజమూరు, వరికుంటపాడు, దుత్తలూరు మండలాల్లో ఈ భూ ప్రకంపనలు సంభవించాయి. దీంతో ఇళ్లలో నుంచి ప్రజలు బయటకు పరుగులు తీశారు.

గత నెల 13న...
గత నెల 13వ తేదీన ఇదే ప్రాంతంలో భూమి కంపించింది. మరోసారి భూమి కంపించడంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. భూ ప్రకంపనలపై కారణాలేమిటన్న దానిపై జిల్లా అధికారులు ఆరా తీస్తున్నారు. అయితే ప్రజలు భయపడాల్సిన, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. ప్రకాశం జిల్లా పామూరులోనూ భూమి కంపించిందని స్థానికులు చెబుతున్నారు. ప్రకాశం జిల్లా పామూరు మండలంలో మూడు సెకన్ల పాటు భూమి కంపించింది.


Tags:    

Similar News