దీపాలు వెలిగించడానికి వెళ్లి మృత్యు ఒడిలోకి...?

కడప జిల్లాలో వరదలు ముంచెత్తున్నాయి. నదులన్నీ పొంగిపొరలుతున్నాయి. ప్రభుత్వం కూడా హెచ్చరికలు జారీ చేసింది

Update: 2021-11-20 03:57 GMT

కడప జిల్లాలో వరదలు ముంచెత్తున్నాయి. నదులన్నీ పొంగిపొరలుతున్నాయి. ప్రభుత్వం కూడా హెచ్చరికలు జారీ చేసింది. కానీ కార్తీక మాసం కావడంతో పూజలకు వెళ్లి పదుల సంఖ్యలో భక్తులు గల్లంతయ్యారు. వరదల తాకిడికి కడప జిల్లాలోని రాజంపేట నియోజకవర్గం దారుణంగా దెబ్బతినింది. అక్కడ పాలపత్తూరు శివాలయం ఉంది.

కార్తీక మాసం కావడంతో...
పాలపత్తూరు శివాలయానికి కార్తీక మాసం కావడంతో అక్కడ పూజలు చేసేందుకు భక్తుల వెళ్లారు. ఒక్క సారిగా నది పొంగడంతో ఆలయాన్ని చుట్టుముట్టింది. ఇప్పటి వరకూ ఐదు మృతదేహాలను గుర్తించారు. ఎంతమంది గల్లంతయింది ఇంకా తెలియరాలేదు. సహాయక చర్యలు జరుగుతున్నాయి. ఈ ఘటనలో పది నుంచి పదిహేను మంది వరకూ చనిపోయి ఉండవచ్చని ప్రత్యక్ష సాక్షులు తెలుపుతున్నారు. మృతదేహాల కోసం గాలింపు చర్యలు జరుగుతున్నాయి.


Tags:    

Similar News