నేటి నుంచి ఏపీలో బీజేపీ పోరుబాట

ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతుంది. ఈరోజు నుంచి బీజేపీ పోరు యాత్ర సాగించనుంది.

Update: 2022-09-19 03:12 GMT

ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతుంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు స్ట్రీట్ మీటింగ్ లు పెట్టాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈరోజు నుంచి బీజేపీ పోరు యాత్ర సాగించనుంది. వచ్చే నెల 2వ తేదీ వరకూ ఈ స్ట్రీట్ మీటింగ్ లు జరుగుతాయి. ఇందుకోసం ప్రత్యేకంగా బస్సు, రథాన్ని బీజపీ సిద్ధం చేసింది. మొత్తం పదిహేను రోజుల పాటు ఈ యాత్ర సాగనుంది.

ఐదువేల సభలు....
175 నియోజకవర్గాల్లో మొత్తం ఐదువేల సభలను నిర్వహించాలన్నది బీజేపీ లక్ష్యంగా నిర్ణయించుకుంది. కేంద్రంలోనూ, రాష‌్ట్రంలోనూ ఒకే ప్రభుత్వం ఉంటే అభివృద్ధి వేగంగా జరుగుతుందని ప్రజలకు వివరించనుంది. గత, ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాలను ఈ సభ ద్వారా ఎండగట్టాలని నిర్ణయించింది. కేంద్రం నుంచి ఏ పథకాల కింద ఎన్ని నిధులు వస్తున్నాయో కూడా వివరించనున్నారు. ఈరోజు విజయవాడ సత్యనారాయణపురంలోని శివాజీ కేఫ్ సెంటర్ లో జరిగే సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పాల్గొననున్నారు.


Tags:    

Similar News