నేటి నుంచి ఏపీలో టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్

ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి పాఠశాలల్లో ఉపాధ్యాయులకు కొత్త హాజరు విధానం అమలులోకి రాబోతుంది

Update: 2022-08-16 02:48 GMT

ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి పాఠశాలల్లో ఉపాధ్యాయులకు కొత్త హాజరు విధానం అమలులోకి రాబోతుంది. ఫేషియల్ రికగ్నిషన్ ను నేటి నుంచి ప్రభుత్వం అమలు చేస్తున్నారు. సిమ్స్ ఏపీ మొబైల్ యాప్ ను ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించింది. ఈ యాప్ ను ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు డౌన్‌లోడ్ చేసుకోవాలని ప్రభుత్వం ఇప్పటికే సూచించింది. విధిగా అందరూ ఉపాధ్యాయులు ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. తన లాగిన్ లో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, సిబ్బంది వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది.

9గంటలు దాటితే...
ఉపాధ్యాయులకు ఎన్ని సెలవులు ఉన్నాయో, వారి ఫొటోలను కూడా యాప్ లో అప్ లోడ్ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పాఠశాలకు వచ్చిన వెంటనే ఉపాధ్యాయుడు ఆ యాప్ లోకి వెళ్లి ఫొటోను అప్‌లోడ్ చేయాల్సి ఉందటుంది. ఉదయం 9 గంటలలోపే ఈ యాప్ లో అప్ లోడ్ చేయాలి. ఒక్క నిమిషం ఆలస్యమైనా యాప్ తీసుకోదు. ఆరోజు సెలవు దినంగానే పరిగణిస్తారు. పాఠశాల ఆవరణలోనే ఈఅప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. దీనిపై ఉపాధ్యాయ సంఘాలు అభ్యంతరం చెబుతున్నా ప్రభుత్వం మాత్రం దీనిని ఈరోజు నుంచి కఠినంగా అమలు చేయాలని నిర్ణయించింది.


Tags:    

Similar News