Akhila Priya : అఖిలప్రియను వదిలి వెళుతున్నారే... సొంత పార్టీ నేతలే ప్రత్యర్థులవుతున్నారా?
ఆళ్లగడ్డ లో టీడీపీ నేతలే పార్టీకి దూరమవుతున్నారు. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ కుటుంబం వ్యవహారశైలితో నేతలు పక్కకు తప్పుకుంటున్నారు.
ఆళ్లగడ్డ లో టీడీపీ నేతలే పార్టీకి దూరమవుతున్నారు. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ కుటుంబం వ్యవహారశైలితో నేతలు పక్కకు తప్పుకుంటున్నారు. ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి ఎన్నికల్లో గెలిచిన భూమా అఖిలప్రియ గెలిచిన నాటి నుంచి తన వర్గం వారు, ప్రత్యర్థులు అనే తేడా లేకుండా కమీషన్లు దండుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రత్యర్థులను ఆట కట్టించడం ఒక వైపు చేస్తూనే మరొక వైపు సొంత పార్టీ నేతల నుంచి కూడా అక్రమంగా వసూళ్లకు అఖిల ప్రియ అనుచరులు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలాంటి వాటికి అఖిలప్రియ పెద్దగా పట్టించుకోరు. ఎవరినీ కేర్ కూడా చేయడం లేదు. అధినాయకత్వం కూడా చూసీ చూడనట్లు వ్యవహరిస్తుందన్న కామెంట్స్ వినపడుతున్నాయి.
రాజీనామా చేయడంతో...
నంద్యాల జిల్లాకు చెందిన శిరివెళ్ల మండలం గుంపరమాన్ దిన్నె ఎంపీటీసీ తులసమ్మ, ఆమె భర్త కుందనూరు మోహన్ రెడ్డి తమ పదవువలతో పాటు పార్టీకి రాజీనామా చేశారు. వాటర్ యూజర్స్ అసోసియేషన్ ఛైర్మన్ గా కుందనూరు మోహన్ రెడ్డి వ్యవహరిస్తుననారు. ఇద్దరూ రాజీనామా చేయడంతో భూమా అఖిలప్రియతో పాటు టీడీపీకి కూడా షాక్ ఇచ్చినట్లయింది. ఇద్దరూ భూమాఅఖిలప్రియకు అనుచరులు. వారి కుటుంబం ఎటు వైపు వెళితే అటువెళుతూ వారి వెన్నంటే నడుస్తున్నారు. అయితే ఈ దఫా పార్టీలో కష్టపడిన కార్యకర్తలకు సరైన గుర్తింపు లభించడం లేదని, పదవులు కూడా దక్కడం లేదని భావించి తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
శత్రువులు ఎందరో...?
తొలిసారి 2014లో తల్లి మరణంతో ఏకగ్రీవంగా ఎనికయిన భూమా అఖిలప్రియ తర్వాత మంత్రి పదవిని చేపట్టారు. 2019 ఎన్నికల్లో భూమా అఖిలప్రియ ఓటమి పాలయ్యారు. ఇక తన తండ్రికి అత్యంత సన్నిహితులైన వారితో కూడా కలిసి పనిచేయడానికి ఇష్టపడటం లేదు. భూమా నాగిరెడ్డి కి అత్యంత సన్నిహితుడైన ఏవీ సుబ్బారెడ్డి కుటుంబంతో అఖిలప్రియకు చాలా ఏళ్ల నుంచి పడటం లేదు. ఇక భూమా కుటుంబంలో కూడా శత్రువులు అనేక మంది ఉన్నారు. దీంతో పాటు స్థానిక నాయకులు కూడా దూరం అవుతుండటంతో అఖిలప్రియ తన సొంత వర్గాన్ని ఏర్పాటు చేసుకునే ప్రయత్నంలో ఉన్నట్లు చెబుతున్నారు. మొత్తం మీద ఆళ్లగడ్డలో జరుగుతున్న వ్యవహారాలు పార్టీ నాయకత్వాన్ని కూడా కలవరానికి గురి చేస్తున్నాయి.