పెళ్లి చేసుకుంటే.. వాతలు తప్పవు
వైఎస్సార్ కడప జిల్లాలోని బూచుపల్లె వంశీయులలో పెళ్లికొడుకు పెళ్లి రోజులు చర్నాకోలతో దెబ్బలు తినాల్సిందే.
వైఎస్సార్ కడప జిల్లాలోని బూచుపల్లె వంశీయులలో పెళ్లికొడుకు పెళ్లి రోజులు చర్నాకోలతో దెబ్బలు తినాల్సిందే. పెళ్లి కుమారుడికి కాసిన్ని దెబ్బలు కట్నంగా ఇస్తారట. బూచుపల్లె వంశీయుల పెళ్లిలో వరుడిని చర్నాకోలుతో మూడు దెబ్బలు కొట్టిన తర్వాతే వివాహం పూర్తయినట్లు భావిస్తారు. పెళ్లి పీటలపై వధువు మెడలో వరుడు తాళి కట్టిన తర్వాత అతడిని కుటుంబ సభ్యులు చర్నకోలతో మూడు దెబ్బలు వేస్తారు. వందల ఏళ్ల క్రితం బూచుపల్లె వంశీయులు గంగమ్మ ఆలయం నుంచి ఓ పెట్టెను ఇంటికి తీసుకొచ్చారు. ఆ తర్వాత పెట్టెను తెరిచి చూడగా ఐదు చర్నకోలాలు కనిపించాయి. వెంటనే ఆలయంలోకి వెళ్లి తప్పు జరిగిందని, క్షమించమని అమ్మవారిని వేడుకున్నారు. గంగమ్మ ప్రత్యక్షమై మీ వంశీయుల వివాహ సమయాల్లో వరుడికి చర్నకోలతో మూడు దెబ్బలు కొట్టాలని ఆదేశించారట. ఆ ఆచారాన్ని నేటికీ కొనసాగిస్తున్నారు.