నాయీ బ్రాహ్మణులను ఇక అలా పిలిస్తే జైలుకే

నాయీ బ్రాహ్మణులను కించపరుస్తూ మాట్లాడితే ఇకపై శిక్ష తప్పదు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వుల జారీ చేసింది.

Update: 2022-08-11 05:12 GMT

నాయీ బ్రాహ్మణులను కించపరుస్తూ మాట్లాడితే ఇకపై శిక్ష తప్పదు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వుల జారీ చేసింది. నాయీ బ్రాహ్మణులను ఇకపై కులం పేరుతో దూషిస్తే కేసు పెట్టేందుకు ఈ జీవో జారీ అయింది. కొన్ని పదాలపై నిషేధాన్ని విధించింది. మంగలి, మంగలోడా, మంగలిది, బొచ్చు గొరిగే వోడా, , కొండ మంగలి తదితర పదాలను ఉపయోగిస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలా పిలిచిన వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా జీవో జారీ చేసింది.

వారి సంక్షేమానికి....
నాయీ బ్రాహ్మణుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొంది. ఇప్పటికే పలు సంక్షేమ పథకాలను వారికి అందిస్తున్నామని ప్రభుత్వం పేర్కొంటుంది. జగనన్న చేదోడు పథకం కింద ఏటా వారికి పది వేల రూపాయలను అందచేస్తుంది. ఏటా నలభై వేల మంది నాయీ బ్రాహ్మణులకు నలభై కోట్ల నగదును జగనన్న చేదోడు పథకం కింద అంద చేస్తుంది. రెండో విడతగా ఈ ఏడాది ఫిబ్రవరిలో అందజేశారు. సంక్షేమంతో పాటు వారు సమాజంలో తలెత్తుకు తిరిగేలా చర్యలు తీసుకునేందుకే ఈ కొత్త చట్టం తీసుకువచ్చామని ప్రభుత్వం పేర్కొంది.


Tags:    

Similar News