పూర్వ విద్యార్థులు తలుచుకుంటే.. ఏదైనా జరుగుతుంది

మేము ఆ కాలేజీలో చదివాము.. ఈ కాలేజీలో చదివాము అని చెప్పుకునే వాళ్లు చాలా మందే ఉంటారు.

Update: 2025-07-08 10:30 GMT

Guntur

మేము ఆ కాలేజీలో చదివాము.. ఈ కాలేజీలో చదివాము అని చెప్పుకునే వాళ్లు చాలా మందే ఉంటారు. కానీ ఆ కాలేజీలు దుర్భర పరిస్థితుల్లో ఉంటే దాన్ని పట్టించుకునే వాళ్లు చాలా తక్కువ. బ్రిటిష్‌ కాలం నాటి ప్రతిష్ఠాత్మక గుంటూరు మెడికల్‌ కళాశాలది అదే పరిస్థితి. అయితే పూర్వ విద్యార్థులు ముందుకు రావడంతో ఇప్పుడు రూపు రేఖలే మారిపోయాయి.

కళాశాలకు ప్రిన్సిపల్‌గా వచ్చిన సుందరాచారికి కాలేజీలో సరైన సదుపాయాలు లేకపోవడంతో చాలా బాధగా అనిపించింది. ఆయన కూడా ఒకప్పుడు ఈ కళాశాల విద్యార్థే. ఈ భవనాలకు పూర్వ వైభవం తీసుకురావాలనే సంకల్పం పెట్టుకుని పూర్వ విద్యార్థుల సహకారంతో నిధులు సేకరించడం ప్రారంభించారు. ఆ నిధులతో తరగతి గదుల పైకప్పులు, చుట్టూ గోడలను సుందరీకరించారు. బర్మా టేకు ఫర్నిచర్‌ను మళ్లీ వినియోగంలోకి తెచ్చారు. ఇప్పటి వరకు 3 కోట్ల రూపాయల విలువైన పనులు పూర్తయ్యాయి.

Tags:    

Similar News