Andhra Pradesh : జగన్ వద్ద పనిచేసిన ముగ్గురు ఐఏఎస్‌లపై బదిలీ వేటు
గత ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన ఐఏఎస్ అధికారులపై వేటు పడింది
IAS officers in telangana
గత ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన ఐఏఎస్ అధికారులపై వేటు పడింది. ముగ్గురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ చీఫ్ సెక్రటరీ నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. చీఫ్ సెక్రటరీగా బాధ్యతలను స్వీకరించిన తర్వాత ఆయన ఐఏఎస్ బదిలీలపై ఫోకస్ పెట్టారు. గత ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి కార్యాలయలో విధులు నిర్వహించిన ముగ్గురు అధికారులను బదిలీచేస్తూ నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.
సీఎంవోలో ఉన్న...
నాడు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సీఎంవోలో ఉన్న ముత్యాల రాజు, నారాయణ భరత్ గుప్తా, పూనం మాలకొండయ్యలను బదిలీ చేశారు. వీరు ముగ్గురు జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ కు రిపోర్టు చేయాలని కోరారు. దీంతో ఐఏఎస్ అధికారుల్లో ప్రక్షాళన మొదలయిందని అర్థమవుతుంది. వరసగా బదిలీల ఉత్తర్వులు అందుతున్నాయి.