గోదారిలో కొట్టుకుపోతున్న జింకలు

గోదావరి వరద ముంపులో వందల సంఖ్యలో జింకలు కొట్టుకుపోతున్నాయి

Update: 2022-07-17 07:24 GMT

గోదావరి వరద ముంపులో వందల సంఖ్యలో జింకలు కొట్టుకుపోతున్నాయి. గోదావరి నది మధ్యలో ఉన్న పులసలంకలో మూడు వందలకు పైగా జింకలు ఉన్నాయి. అయితే గోదావరికి తీవ్రస్థాయిలో వరద రావడంతో పులసలంకలోనిక నీరు ప్రవేశించింది. ఇవి గోదావరిలో కొట్టుకుపోతున్నాయి. జింకలు కొట్టుకుపోతున్న దృశ్యాలు హృదయ విదారకరంగా ఉన్నాయి. వాటిని రక్షించేందుకు కూడా ఎటువంటి ప్రయత్నాలు చేయడం లేదు.

300 జింకలు....
ధవళేశ్వరం బ్యారేజీ సమీపంలోనే పులసలంక ఉంటుంది. వరద నీటితో పులసలంక మునిగిపోవడంతో ఇక్కడ ఉన్న జింకలు గోదావరి నీటిలో కొట్టుకుపోతున్నాయి. పొట్టిలంక సమీపంలో కొట్టుకుపోతున్న నాలుగు జింకలను రైతులు పట్టుకుని రక్షించారు. అటవీ శాఖ అధికారులు దీనిపై శ్రద్ధ పెట్టకపోవడంతో జింకలు నీటిలో కొట్టుకుపోతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఒక జింక కుక్కల దాడిలో చనిపోయింది. అటవీ శాఖ అధికారులు దీనిపై పోస్ట్ మార్టం నిర్వహించారు.


Tags:    

Similar News