Tirumala : టీటీడీ కి భారీ విరాళం .. ఎంతో తెలుసా?
తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్నదాన ప్రసాదం ట్రస్ట్ కు భారీ విరాళాన్ని ఇచ్చారు
టీటీడీ కి భారీ విరాళం నిత్యం అందుతుంటాయి. శ్రీవారి మొక్కులు తీర్చుకునేందుకు వారి సేవలో తరించేందుకు ప్రపంచ వ్యాప్తంగా భక్తులు శ్రీవారికి భారీ విరాళాలు ఇస్తుంటారు. ఎక్కవగా అన్న ప్రసాదం ట్రస్ట్ కు విరాళాలు ఎక్కువగా వస్తుంటాయి. శ్రీవారి చెంతన భక్తులకు ఉచితంగా పెట్టే అన్న ప్రసాదానికి విరాళమిస్తే పుణ్యం వస్తుందని భావిస్తారు.
ఒకటిన్నర కోట్లు...
తాజాగా ఈరోజు తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్నదాన ప్రసాదం ట్రస్ట్ కు భారీ విరాళాన్ని ఇచ్చారు. అన్నప్రసాదం ట్రస్ట్ కు రూ 1.5 కోట్లు విరాళాన్నిటీడీడీ చైర్మన్ బీఆర్ నాయుడు కు అందచేశారు. బెంగుళూరుకి చెందిన సుయుగ్ వెంచర్స్ ఎల్.ఎల్.పి కంపెనీ ఛైర్మన్ యతిష్ సూరినేని ఈ చెక్కును టీటీడీ చైర్మన్ కు విరాళం చెక్కును అందజేశారు.