అంత తక్కువ స్థలంలో అలా ఎలా కట్టావయ్యా?
తక్కువ స్థలంలోనే ఎక్కువ అంతస్థులు కట్టేస్తుంటారు కొందరు.
తక్కువ స్థలంలోనే ఎక్కువ అంతస్థులు కట్టేస్తుంటారు కొందరు. అలాంటి ఓ బిల్డింగ్ గురించి చర్చ జరుగుతూ ఉంది. పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరులో కేవలం 16 గజాల్లో చేపట్టిన నిర్మాణం షాక్ కు గురిచేస్తోంది. అక్కడ సీసీ రోడ్డు ప్రారంభించడానికి వచ్చిన ఉప సభాపతి, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు దీన్ని చూసి విస్తుపోయారు.
రోడ్డు మార్జిన్లో అనుమతులు లేకుండానే నిర్మిస్తున్నట్లు ఆయనకు తెలిసింది. దీంతో రఘురామ స్థానిక పంచాయతీ కార్యదర్శిని పిలిచి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుమతి లేకుండా నిర్మిస్తుంటే ఏం చేస్తున్నారంటూ నిలదీశారు. వెంటనే కూల్చివేయాలని ఆదేశించారు.