నెల్లూరు ప్రసన్న ఇంటిపై దాడి
నెల్లూరులోని మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై దాడి జరిగింది.
నెల్లూరులోని మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఆయన ఇంట్లో ఉన్న ఫర్నీచర్ ను, వాహనాలను ధ్వంసం చేశారు. గత కొద్ది రోజులుగా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే.
జగన్ ఫోన్...
ఈ నేపథ్యంలోనే ఇద్దరు వ్యక్తిగత దూషణలకు దిగారు. దీంతో నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై దాడి జరిగిందని, టీడీపీ కార్యకర్తలే ఈ దాడులు చేశారని నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. మరొక వైపు ప్రసన్నకుమార్ రెడ్డితో ఫోన్ లో మాట్లాడిన వైఎస్ జగన్ ఏం జరిగిందని ఆరా తీశారు.