Andhra Pradesh : నేడు లిక్కర్ స్కామ్ కేసులో హైకోర్టులో విచారణ
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో నిందితుల బెయిల్ ను రద్దు చేయాలంటూ ప్రాసిక్యూషన్ వేసిన హౌస్ మోషన్ పిటీషన్ విచారణకు రానుంది.
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో నిందితుల బెయిల్ ను రద్దు చేయాలంటూ ప్రాసిక్యూషన్ వేసిన హౌస్ మోషన్ పిటీషన్ విచారణకు రానుంది.ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో ఏసీబీ కోర్టు ముగ్గురు నిందితులకు బెయిల్ మంజూరు చేసింది. మాజీ ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డి, మాజీ సీఎంవో అధికారి కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలకు ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
బెయిల్ రద్దు చేయాలని...
అయితే వీరు సాక్ష్యాలను ప్రభావితం చేసే అవకాశముందని, వీరి బెయిల్ ను రద్దు చేయాలంటూ ప్రాసిక్యూషన్ హైకోర్టులో హౌస్ మోషన్ పిటీషన్ దాఖలు చేసింది. దీనిపై నేడు విచారణ జరగనుంది. అయితే నిన్న విజయవాడ జైలు నుంచి బెయిల్ రావడంతో ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో ముగ్గురు నిందితులు బయటకు విడుదలయ్యారు. దీనిపై నేడు హైకోర్టు తీర్పు ఏం చెప్పనుందో ఉత్కంఠగా మారింది.