పక్కా ఆధారాలతోనే వల్లభనేని వంశీ అరెస్ట్

పక్కా ఆధారాలు ఉన్నాయి కాబట్టే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్టు చేశారని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు

Update: 2025-02-15 12:51 GMT

పక్కా ఆధారాలు ఉన్నాయి కాబట్టే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్టు చేశారని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. తాము ప్రతీకారమే తీర్చుకోవాలి అనుకుంటే ఇన్ని నెలలు ఎందుకు ఆగుతామని ఆమె ప్రశ్నించారు. డీజీపీ ఆఫీస్ కు కూతవేటు దూరంలో ఉన్న మా పార్టీ ఆఫీస్ పై దాడి జరిగినప్పుడు వీళ్లు ఎందుకు మాట్లాడలేదని అనిత నిలదీశారు.

మాజీ సీఎం మాట్లాడుతున్నది...
దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఈరోజు మాజీ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారని అన్నారు. సత్యవర్ధన్ ఫిర్యాదు ఆధారంగానే పోలీసులు వంశీపై చర్యలు తీసుకున్నారని తెలిపారు. గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో నిందితులందరినీ అరెస్ట్ చేస్తున్నామని, అందులో భాగంగానే వల్లభనేని వంశీని కూడా అరెస్ట్ చేశామని చెప్పారు.


Tags:    

Similar News