మారేడుమిల్లికి హోం మంత్రి వంగలపూడి అనిత

మారేడుమిల్లికి హోం మంత్రి వంగలపూడి అనిత చేరుకోన్నారు

Update: 2025-12-12 03:34 GMT

మారేడుమిల్లికి హోం మంత్రి వంగలపూడి అనిత చేరుకోన్నారు. అల్లూరి జిల్లాలో జరిగిన బస్సు ప్రమాద స్థలిని హోం మంత్రి సందర్శించనున్నారు. అల్లూరి జిల్లా ప్రమాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన మంత్రి అనిత ప్రైవేటు బస్సు లోయలో పడి యాత్రికులు దుర్మరణం చెందడం పట్ల మంత్రి విచారకరమని తెలిపారు. గాయపడినవారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను మంత్రి అనిత ఆదేశించారు.

బాధిత కుటుంబాలకు...
బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హోం మంత్రి అనిత చెప్పారు. మారేడుమిల్లి బస్సు ప్రమాద ఘటనాస్థలానికి హుటాహుటిన హోం మంత్రి అనిత బయలుదేరి వెళ్లారు. ప్రమాద స్థలితో పాటు చింతూరు ఏరియా ఆసుపత్రికి వెళ్లి అక్కడ క్షతగాత్రులను అనిత పరామర్శించనున్నారు. బస్సు ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది.


Tags:    

Similar News