ఫార్మాసిటీ ప్రమాదంపై హోం మంత్రి అనిత ఏమన్నారంటే?
పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదంపై హోం మంత్రి అనిత స్పందించింది.
పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదంపై హోం మంత్రి అనిత స్పందించింది. ఎస్‍ఎస్ ఫార్మా కంపెనీలో విషవాయువులు లీక్ పై హోం మంత్రి ఆరా తీశారు. జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ తో ఫోన్ లో మాట్లాడి వివరాలు తెలుసుకున్న మంత్రి వంగలపూడి అనిత వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశింాచరు. ఇద్దరు కార్మికులుమృతి చెందడం పట్ల హోంమంత్రి అనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
విచారణ జరపాలని...
విషవాయువు పీల్చి అస్వస్థతకు గురైన బాధితుడికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించిన హోం మంత్రి వంగలపూడి అనిత ప్రమాద ఘటనపై విచారణ జరపాలని అన్నారు. మంగళవారం అర్ధరాత్రి ఎస్‍ఎస్ ఫార్మా కంపెనీలో విషవాయువు లీకయి ఇద్దరు కార్మికులు మరణించిన నేపథ్యంలో హోం మంత్రి ఈ ఆదేశాలు జారీ చేశారు.