జగన్ పై హోంమంత్రి అనిత ఆగ్రహం
జగన్‌పై హోంమంత్రి వంగలపూడి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల వెళ్లడం జగన్‌కు ఇష్టం లేదన్నారు
vangalapudi anita
జగన్‌పై హోంమంత్రి వంగలపూడి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల వెళ్లడం జగన్‌కు ఇష్టం లేదని, దుఅందుకే తిరుమల పర్యటనను రద్దు చేసుకున్నారని అనిత అన్నారు. ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ డిక్లరేషన్ పై సంతకం పెట్టాలనే జగన్ తిరుమలకు వెళ్లలేదని అన్నారు. హిందూ సంప్రదాయాలను పాటించరా? అని అనిత ప్రశ్నించారు.
అందుకే తిరుమల పర్యటన రద్దు...
దీనికి తోడు జగన్ తనకు నోటీసులు ఇచ్చారని అబద్ధాలు చెబుతున్నారని అనిత అన్నారు. తిరుపతిలో పోలీస్ యాక్ట్ 30 అమలులో ఉన్నందును వైసీపీ నేతలకు నోటీసులు ఇచ్చామన్నారు. ఒక్క వైసీపీ నేతనూ తాము హౌస్ అరెస్ట్ చేయలేదని తెలిపారు. జగన్‌కు డిక్లరేషన్ ఇచ్చే ఉద్దేశం లేదని, ప్రసాదం ఇస్తే పక్కన పెట్టేవాళ్లు..రుచి గురించి మాట్లాడడం విడ్డూమని హోంమంత్రి అనిత ఎద్దేవా చేశారు.