హిందూపూరం వైసీపీ కార్యాలయంపై దాడి
హిందూపురం వైసీపీ కార్యాలయంపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు
హిందూపురం వైసీపీ కార్యాలయంపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. నందమూరి బాలకృష్ణపై హిందూపురం వైసీపీ ఇన్‌ఛార్జి దీపిక భర్త వేణు రెడ్డి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. నలభై ఏళ్లుగా ఈ ప్రాంతంలో మనం ఎవడికిందో బానిస బతుకులు బతుకుతున్నామని వేణు రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. ఎవరో హైదరాబాద్‌లో ఉంటే వాడి కింద మనం బతకాలా? అని వేణు రెడ్డి ఒక కార్యక్రమంలో ప్రశ్నించారు.
గుర్తు తెలియని వ్యక్తులు...
దీంతో ఈ వ్యాఖ్యలు బయటకు రావడంతో హిందూపురం వైసీపీ కార్యాలయంపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. పార్టీ కార్యాలయం అద్దాలను పగుల కొట్టారు. దీంతో రెండు వర్గాల మధ్య ఉద్రిక్తత నెలకొంది. మరొకవైపు నందమూరి బాలకృష్ణ కూడా హిందూపురం పర్యటనలో ఉండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ముందస్తుగా కొందరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది.