Andhra Pradesh : నేటి నుంచి హిందూపురంలో నందమూరి బాలకృష్ణ
హిందూపురం శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ నేటి నుంచి నియోజకవర్గంలో పర్యటించనున్నారు
హిందూపురం శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ నేటి నుంచి నియోజకవర్గంలో పర్యటించనున్నారు. మూడు రోజుల పాటు హిందూపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ మూడు రోజుల పర్యటనలో భాగంగా నందమూరి బాలకృష్ణ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. వివిధ పనులకు శంకుస్థాపనలను, ప్రారంభోత్సవాలను చేయనున్నారు.
మూడు రోజుల పర్యటనలో...
హిందూపురం నియోజకవర్గంలో నందమూరి బాలకృష్ణ తరచూ పర్యటిస్తుంటారు. కార్యకర్తలు, నేతలతో కలిసి మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కరిస్తుంటారు. ఈసారి మూడు రోజుల పర్యటనలో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడంతో పాటు చిలమత్తూరులో అధికారులు, నాయకులతో జరిగే సమీక్షలో కూడా పాల్గొననున్నారు.