బెజవాడలోనూ హిజాబ్ వివాదం

బెజవాడలోనూ హిజాబ్ వివాదం రగిలింది. కళాశాలలో బురఖా వేసుకుని వచ్చిన విద్యార్థినులను కళాశాల యాజమాన్యం అడ్డుకుంది

Update: 2022-02-17 04:48 GMT

బెజవాడలోనూ హిజాబ్ వివాదం రగిలింది. కళాశాలలో బురఖా వేసుకుని వచ్చిన విద్యార్థినులను కళాశాల యాజమాన్యం అడ్డుకుంది. ఫస్ట్ ఇయర్ నుంచి తాము ఐడీ కార్డులతోనే కళాశాలకు వస్తున్నామని విద్యార్థినులు వాదిస్తున్నారు. విజయవాడలోని ఒక ప్రయివేటు కళాశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది.

తల్లిదండ్రుల ఆందోళన...
బురఖా ధరించిన విద్యార్థినులను కళాశాల లోపలికి అనుమతించకపోవడంతో విద్యార్థినుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. నిరసన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కళాశాల యాజమాన్యం ఇప్పుడు ఎందుకు వ్యవహరిస్తుందని విద్యార్థినుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థిితిని చక్కదిద్దుతున్నారు.


Tags:    

Similar News