కడప జిల్లా జైలు అధికారులపై సస్పెన్షన్ వేటు

కడప జిల్లా జైలు అధికారులు, సిబ్బందిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు.

Update: 2025-07-22 04:17 GMT

కడప జిల్లా జైలు అధికారులు, సిబ్బందిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. జైలర్ అప్పారావు, డిప్యూటీ సూపరింటెండెంట్ కమలాకర్ పై సస్పెన్షన్ వేటు వేశఆరు. మరో ముగ్గురు జైలు వార్డర్లపైనా సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు సస్పెన్షన్ ఉత్తర్వులను జైలు శాఖ డీజీ జారీచేశారు కడప జైలులో ఖైదీలకు మొబైల్ ఫోన్లు సరఫరా ఆరోపణలతో సస్పెన్షన్ వేటు వేశారు.

సెల్ ఫోన్ ఇవ్వడంపై...
రిమాండ్ ఖైదీగా ఉన్న స్మగ్లర్లకు సెల్ ఫోన్లు అందిస్తున్నారని అభియోగాలు వినిపించిన నేపథ్యంలోనే వీరిపై వేటు పడిందని అధికారిక వర్గాలు వెల్లడించాయి.కడప జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఎర్రచందనం స్మగ్లర్లకు సెల్ ఫోన్లు అందజేయడంపై చర్యలు తీసుకున్నట్లు ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఆరోపణలపై నాలుగు రోజులపాటు కడప జైలులో విచారణ జరిపిన డీఐజీ రవికిరణ్. ప్రాథమిక నివేదిక ఆధారంగా ఐదుగురిపై సస్పెన్షన్ వేటు వేశారు


Tags:    

Similar News