Andhra Pradesh : నేడు లిక్కర్ స్కామ్ కేసులో హైకోర్టు విచారణ
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ పిటిషన్‌పై హైకోర్టులో నేడు విచారణ జరగనుంది.
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ పిటిషన్‌పై హైకోర్టులో నేడు విచారణ జరగనుంది. నలుగురు నిందితుల బెయిల్ ను రద్దు చేయాలని సిట్ పిటిషన్ వేసింది. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులుగా ఉన్న ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలతో పాటు పైలా దిలీప్ కు ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో బెయిల్ మంజూరు చేస్తే నిందితులు సాక్ష్యాలను తారుమారు చేస్తారని సిట్ వాదించనుంది.
నిందితులకు బెయిల్...
మరొక వైపు ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ పార్లమెంటు సభ్యుడు మిథున్‌రెడ్డి సిట్ కస్టడీకి తీసుకోనుంది. నేడు, రేపు మిథున్‌రెడ్డిని విచారించనున్నారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 6 వరకు విచారణ కొనసాగుతుంది. ఈ నెల 26వ తేదీ వరకూ మిధున్ రెడ్డి రిమాండ్ ను పొడిగిస్తూ ఏసీబీ కోర్టు నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రాజమండ్రి జైలులో మిధున్ రెడ్డి రిమాండ్ ఖైదీగా ఉన్నారు.