Midhun Reddy : నేడు మిధున్ రెడ్డి బెయిల్ రద్దు పిటీషన్ పై విచారణ

వైసీపీ పార్లమెంటు సభ్యుడు పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి బెయిల్ రద్దు పిటీషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది

Update: 2025-10-09 04:43 GMT

వైసీపీ పార్లమెంటు సభ్యుడు పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి బెయిల్ రద్దు పిటీషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. గత నెల 28వ తేదీన ఏసీబీ కోర్టు మిధున్ రెడ్డికి బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో నిందితుడిగా ఉన్న మిధున్ రెడ్డి దాదాపు 72 రోజుల పాటు రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.

సిట్ పిటీషన్ పై...
అయితే మిధున్ రెడ్డికి బెయిల్ మంజూరు చేస్తూ ఏసీబీ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం అధికారులు హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. మిధున్ రెడ్డి సాక్ష్యాలను ప్రభావితం చేస్తారని, బెయిల్ రద్దు చేయాలని పిటీషన్ లో కోరారు. దీనిపై నేడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వచిారణ జరగనుంది. మరొకవైపు ఏసీబీ కోర్టు మిధున్ రెడ్డికి పాస్ పోర్టు ఇవ్వాలని కూడా ఆదేశించింది. యూఎస్ పర్యటనకు వెళ్లేందుకు వీలుగా పాస్ పోర్టు ఇవ్వాలని తెలిపింది.


Tags:    

Similar News