Breaking : వైఎస్ జగన్ పిటీషన్ పై హైకోర్టు కీలక నిర్ణయం

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.

Update: 2025-09-24 06:19 GMT

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వడంపై స్పీకర్ ఇచ్చిన రూలింగ్ పై పిటీషన్ వేశారు. నేడు స్పీకర్ రూలింగ్స్ పై హైకోర్టులో విచారణ జరిగింది. దీనిపై విచారించిన హైకోర్టు శాసనసభ కార్యదర్శికి, స్పీకర్ కు, పయ్యావుల కేశవ్ కు నోటీసులు జారీ చేసింది.

ప్రతివాదులకు నోటీసులు...
ప్రతిపక్ష హోదా ఇచ్చేందుకు తిరస్కరిస్తూ స్పీకర్ ఈ ఏడాది ఫిబ్రవరి 5వతేదీన రూలింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై జగన్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. స్పీకర్ రూలింగ్ ను రద్దు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. తనకు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేలా ఆదేశాలు జారీ చేయాలని హైకోర్టును కోరారు. దీనిపై నేడు హైకోర్టులో జరిగిన విచారణలో ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.


Tags:    

Similar News