Breaking : చంద్రబాబు కు బెయిల్

స్కిల్ డెవలెప్‌మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు మధ్యంతర బెయిల్ పిటీషన్ పై హైకోర్టు తీర్పు వెలువరించింది.

Update: 2023-10-31 05:10 GMT

chandrababu

స్కిల్ డెవలెప్‌మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు మధ్యంతర బెయిల్ పిటీషన్ పై హైకోర్టు తీర్పు వెలువరించింది. మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు న్యాయస్థానం సుముఖత వ్యక్తం  చేసింది. నాలుగు వారాల పాటు బెయిల్ ను మంజూరు చేసింది. కంటి శస్త్ర చికిత్స ఇప్పుడు అవసరం అన్న వాదనను పరిగణనలోకి తీసుకుంది. దీంతో ఆయనకు హైకోర్టులో ఊరట లభించింది. చంద్రబాబు ఈ కేసులో తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ వేసుకున్న పిటీషన్ పై విచారణ పూర్తయిన సంగతి తెలిసిందే. రెగ్యులర్ బెయిల్ విచారణ నవంబరు పదో తేదీకి వాయిదా వేసింది. ఈ ఏడాది సెప్టంబరు తొమ్మిదో తేదీన చంద్రబాబు స్కిల్ డెవలెప్‌మెంట్ స్కామ్ కేసులో అరెస్లయ్యారు. 

రిజర్వ్ చేసిన...
ఇప్పటికే దీనికి సంబంధించిన ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసిన సంగతి తెలిసిందే. స్కిల్ డెవలెప్‌మెంట్ స్కామ్ కేసులో అరెస్టయిన చంద్రబాబు రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉంటున్నారు. ఆయన 53రోజుల నుంచి జైలులోనే ఉన్నారు. ఆయన కుడి కంటికి శస్త్ర చికిత్స చేయాలని వైద్యులు తెలిపారు. చంద్రబాబు తరుపున న్యాయవాదులు కూడా ఆయన ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని బెయిల్ ఇవ్వాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. నాలుగు వారాల పాటు బెయిల్ మంజూరు చేసింది. చంద్రబాబుకు బెయిల్ రావడంతో రాష్ట్రమంతటా టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. 


Tags:    

Similar News