తిరుమలలో భారీగా పెరిగిన రద్దీ..

స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న స్వామివారికి హుండీ ఆదాయం రూ.3.60 కోట్లు వచ్చినట్లు టీటీడీ తెలిపింది.

Update: 2023-05-25 03:17 GMT

crowd in tirumala today

తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. విద్యార్థులకు వేసవి సెలవులు ముగుస్తుండటంతో శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. స్వామివారి సర్వదర్శనానికి 29 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వెల్లడించింది. శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం పడుతుందని తెలిపింది. కాగా.. బుధవారం (మే24) శ్రీవారిని 74,995 మంది భక్తులు దర్శించుకున్నారు.

స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న స్వామివారికి హుండీ ఆదాయం రూ.3.60 కోట్లు వచ్చినట్లు టీటీడీ తెలిపింది. అలాగే 38,663 మంది భక్తులు తలనీలాల మొక్కులు చెల్లించుకున్నారు. కాగా.. భక్తుల రద్దీ పెరుగుతున్న దృష్ట్యా టీటీడీ చర్యలు తీసుకుంటోంది. స్వామివారి దర్శనానికి ఆలస్యం కాకుండా ఉండేందుకు పలు సేవలను ఏకాంతంగా నిర్వహిస్తున్నారు. అలాగే డైరెక్ట్ గా వీఐపీ పాస్ ఉన్నవారినే దర్శనానికి అనుమతిస్తున్నారు. కొండపై ఉన్న భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా తాగునీరు, అన్నప్రసాదం అందిస్తున్నారు.


Tags:    

Similar News