తిరుమలలో భారీగా పెరిగిన రద్దీ.. వెలుపలికి క్యూలైన్లు

మరో 12 రోజుల్లో విద్యార్థులకు వేసవి సెలవులు ముగియనుండటంతో రోజురోజుకూ రద్దీ పెరిగిపోతోంది.

Update: 2023-05-30 03:20 GMT

tirumala tirupathi devasthanam

కలియుగ ప్రత్యక్ష దైవంగా కొలిచే.. ఏడుకొండలపై కొలువై ఉన్న శ్రీనివాసుడిని దర్శించుకునేందుకు తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు. మరో 12 రోజుల్లో విద్యార్థులకు వేసవి సెలవులు ముగియనుండటంతో రోజురోజుకూ రద్దీ పెరిగిపోతోంది. మంగళవారం (మే30) తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో క్యూలైన్లు నిండిపోగా.. క్యూ కాంప్లెక్స్ వెలుపల కూడా భక్తులు వేచి చూస్తున్నారు. నేడు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.

ఇక సోమవారం (మే29) 78,126 మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నట్లు తెలిపింది. వీరిలో 37,597 మంది భక్తులు శ్రీవారికి తలనీలాల మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.74 కోట్లు వచ్చినట్లు టీటీడీ పేర్కొంది. భక్తుల రద్దీ పెరగడంతో అన్నపానీయాలకు లోటు లేకుండా టీటీడీ చర్యలు తీసుకుంటోంది. కొండపై ఎక్కడికక్కడ త్రాగునీరు, అన్నప్రసాద వితరణ కేంద్రాలను ఏర్పాటు చేసింది.


Tags:    

Similar News