Rain Alert : రెండు రోజుల పాటు భారీ వర్షాలేనట
తెలుగు రాష్ట్రాలలో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.
Rain Alert in Andhra Pradesh
తెలుగు రాష్ట్రాలలో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ మరో అల్పపీడనం కారణంగా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ప్రధానంగా ఈ అల్పపీడన ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాలైన ఏపీలలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
రెండు రాష్ట్రాల్లో...
అనేక చోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతుందని తెలిపింది. దీంతో పాటు కొన్ని చోట్ల మోస్తరు గాను, మరికొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు పడే అవకాశముందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్ లో కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశముందని కూడా పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.