భారీ వర్షాలతో నేడు, రేపు పాఠశాలలకు సెలవు

నేడు నెల్లూరు, చిత్తూరు జిల్లాలో విద్యాసంస్థలకు అధికారులు సెలవు ప్రకటించారు.

Update: 2025-10-22 02:56 GMT

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నేడు నెల్లూరు, చిత్తూరు జిల్లాలో విద్యాసంస్థలకు అధికారులు సెలవు ప్రకటించారు. నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం మధ్యాహ్ననికి నైరుతి, పశ్చిమమధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

వాయుగుండం ప్రభావంతో...
దీని ప్రభావంతో నేడు ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. మిగతా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని, దక్షిణకోస్తా తీరం వెంబడి గంటకు 35 నుంచి 55 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, చెట్ల క్రింద, భారీ హోర్డింగ్స్ వద్ద ఉండవద్దని, లోతట్టు ప్రాంతప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని, పొంగిపోర్లే వాగులు,రోడ్లు దాటే ప్రయత్నం చేయరాదని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.


Tags:    

Similar News