గోదావరి నదికి వరద ఉధృతి
అల్పపీడనంతో పాటు వాయుగుండం ప్రభావంతో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గోదావరికి వరద నీరు పెరుగుతుంది
అల్పపీడనంతో పాటు వాయుగుండం ప్రభావంతో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మరోవైపు గోదావరి వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల ప్రాణాలు, ఆస్తులను రక్షించేందుకు సంబంధిత అధికారలుప్రకటనలు చేస్తున్నారు. గోదావరి పరివాహక మండలాల్లోని గ్రామాలలో నది నీటి మట్టం పెరుగుతున్న దృష్ట్యా, ప్రజలు నది తీరాలకు దగ్గరగా వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
నదిలోకి ఎవరూ...
వరద ప్రభావిత ప్రాంతాలలో అగ్నిమాపక, రెవెన్యూ, పోలీస్, వైద్యశాఖ, విద్యుత్ శాఖలతో సమన్వయం చేస్తూ అత్యవసర సహాయక చర్యలు వేగవంతం చేశారు.శుద్ధి చేసిన తాగునీరు, పాలు, పాలు పొడి, వైద్య సహాయం, ఆహార సరఫరా తక్షణమే అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.అధికార యంత్రాంగం అంతా అత్యంత అప్రమత్తంగా ఉండాలని, ప్రజలు ఎవ్వరు నదిలోకి వెళ్లవద్దని, ఈతకు వెళ్లడం, చేపలు పట్టడం వంటివి చేయరాదని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.