Andhra Pradesh : ఒంగోలులో పిడుగు పడి బాలుడి మృతి

ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు పడుతున్నాయి. పలుచోట్ల పిడుగులు పడుతున్నాయి. ప్రకాశం జిల్లలోనూ ఎడతెరపలేని వర్షం పడింది

Update: 2025-09-17 06:16 GMT

ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు పడుతున్నాయి. పలుచోట్ల పిడుగులు పడుతున్నాయి. ప్రకాశం జిల్లలోనూ ఎడతెరపలేని వర్షం పడింది. ఒంగోలులో పిడుగుపాటుకు పదేళ్ల బాలుడు మృతి చెందినట్లు అక్కడి ప్రతక్ష సాక్షులు తెలిపారు. మృతిచెందిన బాలుడు కంకణాల చందుగా గుర్తించారు. ఉదయం ఒంగోలులో కాసేపు భారీగా వర్షం కురవడంతో పాటు పిడుగులతో కూడా ప్రజలను భయపెట్టింది.

వాతావరణ శాఖ హెచ్చరిక...
వాతావరణ శాఖ హెచ్చరిక చేస్తూనే ఉంది. పిడుగులు పడతాయని, భారీ వర్షాలు కురుస్తాయని, ఎవరూ విద్యుత్తు స్థంభాల వద్ద, చెట్ల వద్ద నిలుచోవద్దని వాతావరణ శాఖ చేసిన సూచనలను ప్రజలు పట్టించుకోవడం లేదు. దీంతో అనేక మంది పిడుగు పాటుకు గురై మరణిస్తున్నారు. ఎవరూ ఈరోజు పొలాల్లో చెట్ల కింద ఉండవద్దని వాతావరణ శాఖ మరొకసారి హెచ్చరించింది.


Tags:    

Similar News