నేడు చంద్రబాబు బెయిల్ కేసు విచారణ
స్కిల్ డెవలెప్‌మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు బెయిల్ ను రద్దు చేయాలన్న పిటీషన్ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.
telangana government, relief, supreme court, mlcs
Skill Development Scam: స్కిల్ డెవలెప్‌మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు బెయిల్ ను రద్దు చేయాలంటూ ఏపీ ప్రభుత్వం వేసిన పిటీషన్ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. బెయిల్ ను రద్దు చేయాలంటూ ఏపీ ప్రభుత్వం పిటీషన్ లో పేర్కొంది. జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ బేలా త్రివేదిల ధర్మాసనం నేడు విచారణ జరపనున్నారు.
స్కిల్ డెవలెప్‌మెంట్ స్కామ్ కేసులో....
స్కిల్ డెవలెప్‌మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబుకు హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆయన ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ తెచ్చుకున్నారని, చంద్రబాబు బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేస్తారని ఏపీ ప్రభుత్వం తన పిటీషన్ లో పేర్కొంది. దీనిపై నేడు చంద్రబాబు తరుపున న్యాయవాది హరీశ్ సాల్వే వాదనలను వినిపించనున్నారు.